[od-discuss] Fwd: Open Definition in Telugu

Daniel Dietrich daniel.dietrich at okfn.org
Wed Oct 26 21:29:03 UTC 2011


Dear all

Thanks to Sridhar Gutam we have a translation of the OD into Telugu!

Mark: are you up to put this online, and then have a short feedback to
list and possibly the okfn blog?

Regards
Daniel

---------- Forwarded message ----------
From: Sridhar Gutam <gutam2000 at gmail.com>
Date: 2011/10/21
Subject: Open Definition in Telugu
To: opendefinition at okfn.org
Cc: Jenny Molloy <jenny.molloy at okfn.org>, daniel.dietrich at okfn.org


Dear Sir,

We have translated Open Definition into Telugu (తెలుగు ) Please do the
needful to post it to the OKD webpage.

Thanks
Sridhar

బహిరంగ నిర్వచనం
భాషాంతరము౧.౧

అంత్యప్రత్యయము
‘విజ్ఞానము’ అను పదమునకు అర్ధము ఈ క్రింద విధముగా తీసుకొన పడినది;
సంగీతము, చలన చిత్రములు మరియు పుస్తకములు మొదలగునవి
శాస్త్రీయ, చారిత్రాత్మక‌, భౌగోళిక మరియు తదితర విజ్ఞాన విషయాలు
ప్రభుత్వము మరియు ఇతర నిర్వాహక సమాచారము

సాఫ్ట్ వేర్ కీలక అంశమైనప్పటికీ ఇది ముందుగానే విశేషముగా చర్చించ
పడినందున ప్రస్తుత పరిధి నుండి తొలగించ పడింది.

'పని' అను పదము, బదిలీ చేయటానికి నిర్దేశించబడిన ఒక అంశము లేక విజ్ఞానము
లోని ఒక భాగాన్ని సూచించుటకు ఉపయోగించ పడుతుంది.
'ప్యాకేజ్' అను పదము కొన్ని పనుల సం గ్రహణ ను సూచించుటకు ఉపయోగించ
పడుతుంది. అయితే అటువంటి ప్యాకేజ్, నిర్దేశించబడిన ఒక పనిగా కూడ పరిగణించ
పడవచ్చు.
'అనుజ్ఞాపత్రము' అను పదము చట్టపరమైన లైసెన్స్ ని తదనుసారము గా లభ్యమగు
పనిని సూచించుటకు ఉపయోగించ పడుతుంది. అయితే ఎక్కడయితే అనుజ్ఞాపత్రము
విధానము ప్రస్తావించ‌ పడ లేదో అచ్చట అమలులో ఉన్న చట్టపరమైన విధానముల
అనుసరణ ద్వారా 'పని' లభ్యత ఉంటుంది (ఉదాహరణ గ్రంథప్రచురణ హక్కు విధానము).

విశదీకరణ
ఒక 'పని' యొక్క పంపిణీ విధానము ఈ క్రింద నిబంధనల కు అనుగుణము గా ఉన్న
యెడల ఆ పనిని 'బహిరంగము' అని అభివర్ణించ‌ వచ్చు.

౧. ప్రవేశము
ఒక పని సహేతుక ఉత్పత్తి ధరకు మించ కుండా, మొత్తముగా ఇంటర్ నెట్ ద్వారా
ఉచితముగా దిగుమతి చేసుకొను ట కు అందుబాటులో ఉంటుంది. అయితే ఆ పని లభ్యత
ప్రాతిపదిక మీద‌ మరియు సులభముగా తర్జుమా కు అనుకూలమైన రూపములో అందుబాటులో
ఉండాలి.

వ్యాఖ్యానము: ఈ విధానాన్ని 'సాంఘిక' బహిరంగము గా అభివర్ణించ వచ్చు -
మిమ్మల్ని ఆ పనిని నిర్వర్తించు కోవటానికి అవకాశమివ్వ ట మే కాకుండా
దాన్ని పొందుటకు అనుమతి కూడా ఉంటుంది. అంటే కొన్ని అంశాలకే పరిమితి
చేయకుండా ఎటువంటి నిబంధనలు లేని విధంగా మొత్తంగా ఉపయోగించుకునే అనుమతి
ఉంటుంది.

౨. తిరిగి పంపిణీ
ఈ అనుజ్ఞాపత్రము, ఏ పార్టీ ని కూడా అమ్ముకోవటానికి కాని, ఎవరికైనా
ఇవ్వటానికి కాని లేక అనేక పనుల నుండి తయారు చేసిన ఒక ప్యాకేజి గా పంపిణీ
చెయ్యటానికి కాని ఎటువంటి నిబంధనలు విధించదు.

౩. తిరిగి ఉపయోగించు కొనుట‌
ఈ అనుజ్ఞాపత్రము,  తర్జుమాలను మరియు పునరుత్పన్న మయిన పనులను ఒరిజినల్
పనికి అనుగుణంగా పంపిణీ చేసుకోగల విధంగా అనుమతులు ఉండాలి.

వ్యాఖ్యానము: ఈ నిబంధన 'వైరల్' లేక 'పరస్పరం పంచుకునే' మరియు ఒరిజినల్
నిబంధనల క్రింద త‌ర్జుమాలను తిరిగి పంపిణీ చేయ వలసిన‌ లైసెన్స్ లను
అడ్డుకొన జాలదు.

౪. సాంకేతిక పరమైన నిబంధనలు ఉండవు
పైన పేర్కొనబడిన అంశాలను ఆచరించటములో సాంకేతిక పరమైన నిబంధనలు లేకుండా ఆ
'పని'ని అందుబాటులో ఉంచాలి. దీన్ని సాధించటమంటే ఆ 'పని'ని బహిరంగ డేటా
రూపములో అంటే దాని కొలమాన వివరణలను ప్రజలకు ఎటువంటి పైకము ఇతర విషయములతో
సంబంధము లేకుండా  దాన్ని ఉపయోగించు కొను ట కు అందుబాటులో ఉంచటమే.

౫. అనుసంధానము
'పని'ని సమర్పించిన మరియు తయారు చేసిన‌ వారిని, ఆ పనికి అనుసంధాన పరిచే
ఒక నిబంధన లైసెన్స్ కు వర్తించ వచ్చు. అటువంటి నిబంధన తప్పనిసరి
అయినప్పుడు దాని విధింపు నొప్పించని విధంగా ఉండాలి. ఉదాహరణకు అనుసంధాన
ప్రక్రియ అవసరమైనప్పుడు అనుసంధాన పరచ వలసిన వ్యక్తుల పేర్లను ఆ 'పని'తో
జతపర్చాల్సి ఉంటుంది.

౬. నిబద్ధత
తర్జుమా ద్వారా వెలువడిన ఒరిజినల్ 'పని'ని పంపిణీ చేయు సమయములో తప్పకుండా
తర్జుమాదారుని పేరు లేక ఆ వెర్షన్ క్రమ సంఖ్యను విధిగా పొందు పరచాలి.

౭. వ్యక్తులకు మరియు సమూహాలకు వివక్ష చూపరాదు
ఈ లైసెన్స్, వ్యక్తుల యెడల గాని వ్యక్తుల సమూహాల యెడల గాని ఎటువంటి
వివక్ష చూపని విధంగా ఉండాలి.

వ్యాఖ్యానము: ఈ విధానము ద్వారా మిక్కిలి లాభము పొందాలంటే, ఎక్కువ
వైవిధ్యము గల వ్యక్తుల కు మరియు వ్యక్తుల సమూహాల కు 'బహిరంగ విజ్ఞానము'
నకు తమ సమర్పణలను అందించే అర్హత కలుగ చేయాలి. కనుక ఎటువంటి 'బహిరంగ
విజ్ఞానము'అందించే లైసెన్స్ అయినా,  ఏ వ్యక్తిని కూడా ఈ విధానము వెలుపలే
బంధించటాన్ని మేము కట్టడి చేస్తాము.
వ్యాఖ్యానము: ఈ వివరణ నేరుగా ‘బహిరంగ మూలాధారము యొక్క నిర్వచనం’ లోని ౫
అంశము నుండి సంగ్రహించటము జరిగింది.

౮. ఆశయాల క్షేత్రాల యెడల వివక్ష ఉండరాదు
ఎటువంటి లైసెన్సులు కూడా ఏ ప్రత్యేక ఆశయ క్షేత్రము పట్ల కూడా వివక్ష తో
వ్యవహరించ రాదు. ఉదాహరణకు వ్యాపారములో కాని జన్యు పరమైన పరిశోధనల లో కాని
నియంత్రణలు పొందు పరచ రాదు.

వ్యాఖ్యానము: ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏ మనగా, వ్యాపార అవసరాల
నిమిత్తము ఈ బహిరంగ విజ్ఞాన మూలాలను ఉపయోగ పడనీయ కుండా అడ్డు పడే
లైసెన్స్ బోనులను నిషిద్దము చేయటము. వ్యాపార వేత్తలను బహిరంగ విజ్ఞాన
మూలాలనుండి దూరము చేయడం లేదని వారు మా సంఘములో ఐక్యమవ్వాలని మేము
కోరుకుంటున్నాము.
వ్యాఖ్యానము: ఈ వివరణ నేరుగా 'బహిరంగ మూలాధారము యొక్క నిర్వచనం' లోని  ౬
అంశము  నుండి సంగ్రహించటము జరిగింది.

౯. అనుజ్ఞాపత్రము పంపిణీ విధానము
'పని' కి జోడించ బడిన హక్కులు, ఆ పని ని తిరిగి పంపిణీ ద్వారా పొందిన
వారందరికీ ఎటువంటి అదనపు అనుజ్ఞాపత్రము జారీ చేయవలసిన అవశ్యకత లేకుండా,
విధి గా  వర్తించాలి.

వ్యాఖ్యానము: ఈ వివరణ నేరుగా 'బహిరంగ మూలాధారము యొక్క నిర్వచనం' లోని ౭
అంశము నుండి సంగ్రహించటము జరిగింది.

౧o. అనుజ్ఞాపత్రము ఒక ప్యాకేజీ కి ప్రత్యేకం కాకూడదు
ఒక‌ 'పని' కి జోడించ బడిన హక్కులు,ఆ పని ఎటువంటి ప్రత్యేక ప్యాకేజీ తో
ముడిపడి ఉన్నదన్న అంశము పై ఆధారపడి ఉండరాదు. ఒక పని ఏదేనా ఒక ప్యాకేజీ
నుండి వెలుపలకు తీసుకున్న దై ఉండి, దాన్ని మరలా అదే నిబంధనల ద్వారా
తిరిగి పంపిణీ చేసి ఉన్నయెడల, అటువంటి పనికి కూడా, ఒరిజినల్ ప్యాకేజీ
ద్వారా పొందిన‌ అవే హక్కులు తిరిగి పంపిణీ ద్వారా పొందిన టువంటి
పార్టీలకు కూడా వర్తిస్తాయి.

వ్యాఖ్యానము: ఈ వివరణ నేరుగా ఒఎస్ డి అంశము ౮ నుండి సంగ్రహించటము జరిగింది.

౧౧. ఒక అనుజ్ఞాపత్రము ఇతర పనుల పంపిణీ ని నిమంత్రించరాదు
అనుజ్ఞాపత్రము, ఎప్పుడూ ఇతర పనుల పంపిణీ ని, అనుజ్ఞాపత్రము పొందిన పనుల
తో పాటు పంపిణీ చేయడాన్ని నిమంత్రించరాదు. ఉదాహరణకు లైసెన్స్ ఎప్పుడూ అదే
మీడియము ద్వారా పంపిణీ చేయబడే ఇతర పనులు కూడా బహిరంగముగా  ఉండాలనే
పిడివాదము చేయరాదు.

వ్యాఖ్యానము: బహిరంగ విజ్ఞాన పంపిణీదారుల కు వారి శ్రేయస్సు ప్రకారమే
నడచుకునే హక్కు వారికి ఉంటుంది. గుర్తు పెట్టుకోండి. పరస్పరం-పంచుకునే
లైసెన్సులు ఒకే విధంగా ఉంటాయి, ఎందుచేతనంటే… అందులో పొందు పరచిన
అంశాలన్నీ ఒకే పని క్రింద‌ ఉన్నప్పుడు మాత్రమే వాటికి వర్తిస్తాయి.
వ్యాఖ్యానము: ఈ వివరణ నేరుగా 'బహిరంగ మూలాధారము యొక్క నిర్వచనం' లోని ౯
అంశము నుండి సంగ్రహించటము జరిగింది.


Thanks & Regards
Sridhar
_________________________________________________________________________
Sridhar Gutam PhD, ARS, PG Dip Patent Laws (NALSAR), IP & Biotechnology (WIPO)
Senior Scientist (Plant Physiology) & Joint Secretary, ARSSF
Central Institute for Subtropical Horticulture (CISH)
Rehmankhera, P.O.Kakori, Lucknow 227107, Uttar Pradesh, India
Fax: +91-522-2841025, Phone: +91-522-2841022/23/24; Mobile:+91-9005760036
http://www.cishlko.org
http://www.arssf.co.nr
http://www.gutam.co.nr
http://works.bepress.com/sridhar_gutam/
https://www.facebook.com/groups/oaindia/
Twitter: http://twitter.com/#!/gutam2000
Facebook: https://www.facebook.com/gutamsridhar
LinkedIn: http://www.linkedin.com/in/sridhargutam




-- 

Daniel Dietrich

The Open Knowledge Foundation
Promoting Open Knowledge in a Digital Age
www.okfn.org - www.opendefinition.org

www.ddie.me
twitter.com/ddie
+49 171 780 870 3


More information about the od-discuss mailing list